గురుకులం ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్
1 min readవిద్యార్థులకు సీట్లను కేటాయించిన:డిసీఓ శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 2024- 2025 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల విద్యార్థులకు (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ ఐ.శ్రీదేవి ఆధ్వర్యంలో గురువారం దిన్నె దేవరపాడు గురుకుల బాలికల పాఠశాలలో ఉ.10 నుండి సాయంత్రం వరకు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.మెరిట్ లిస్టు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు ఏ పాఠశాలలో మీరు చేరుతారని విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ఇష్టప్రకారం బైపీసీ,ఎంపీసీ,సిఈ సి,ఎంఈసి తదితర గ్రూపులకు ఉమ్మడి జిల్లాల్లోని దినదేవరపాడు,లక్ష్మాపురం, వెల్దుర్తి,కోయిలకుంట్ల,ఆళ్లగడ్డ తదితర కళాశాలల్లో చేరడానికి విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు కోరుకున్న గ్రూపులకు సీట్లు కేటాయించడం జరిగిందని సీట్లు కేటాయించిన విద్యార్థులు వెంటనే తమ దృవత్రాలతో కళాశాలల్లో చేరాలని డిసీఓ శ్రీదేవి అన్నారు.బాలికల విద్యార్థులు పాఠశాల దగ్గరికి ఉదయాన్నే భారీగా చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు రామ సుబ్బారెడ్డి,సంధ్యారాణి, వెంకటరమణమ్మ,అరుణా కుమారి,జూపాడుబంగ్లా వైస్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరప్ప మరియు సిబ్బంది సతీష్, రజిత తదితరులు పాల్గొన్నారు.