రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. ..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలోని పలు గ్రామాలకు చెందిన రౌడీ షీటర్లకు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. సత్ ప్రవర్తనతో మెలగాలని ఏదైనా తేడా వస్తే ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలే ముఖ్యమన్నారు.