కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటించండి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా నందలి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు అప్రమతంగా ఉండి సంయమనంతో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కౌంటింగ్ ఏజెంట్ లకు అవగాహన కార్యక్రమంలో అనంతరత్నం మాట్లాడుతూ కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున కూర్చుండే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానాలు వచ్చిన అధికారులకు తెలియ చేయాలని. ఎన్నికల నిబంధనలు పాటించాలని ఉదయం ఆరు గంటల లోపు కౌంటింగ్ హాలుకు వెళ్లాలని ఏజెంట్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఒక బుక్కు పెన్ను తీసుకుని వెళ్లాలని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు అక్కడే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎలాంటి అనుమానాలు వచ్చిన అధికారులకు మరియు అభ్యర్థికి సమాచారమిచ్చి మీ అనుమానాన్ని పరిష్కరించుకోవాలని సెల్ ఫోన్లు లోపలికి అనుమతించ బడవని, మద్యం సేవించకూడదని ఏజెంట్లు లోనికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్లరాదని కౌంటింగ్ ప్రదేశంలో జాతీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ముందు వరుసలో అవకాశం ఉంటుందని తెలియజేశారు. కనుక ప్రతి ఒక్కరూ పై నిబంధనలు తప్పక పాటించాలని అనంత రత్నం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలాని భాష, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్ సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ మరియు కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.