PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చెయ్యండి

1 min read

సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ నితీష్ వ్యాస్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదేశించారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమీషన్ కార్యాలయం నుండి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ మాట్లాడుతూ పోస్ట్ పోల్ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ కేంద్రాల వద్ద అనుమతి లేకుండా ఎవ్వరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రలోనికి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మెడికల్ టీమ్స్, అంబులెన్స్, త్రాగు నీరు, నిరంతర విద్యుత్ బ్యాక్ అప్ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు రౌండ్ల వారీగా డేటా మొత్తాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు.అంతకుముందు జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేయడానికి కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదే విధంగా సిబ్బందిని కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు అవసరమైన బస్సులను నిర్దేశించిన సమయంలో కలెక్టరేట్ వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ను అదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి/మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, ఆదోని రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, పత్తికొండ రిటర్నింగ్ అధికారి/ఆర్డీఓ రామలక్ష్మి, కోడుమూరు రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డి, ఎమ్మిగనూరు రిటర్నింగ్ అధికారి చిరంజీవి, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి విశ్వనాథ్, ఆలూరు రిటర్నింగ్ అధికారి రాము నాయక్, హౌసింగ్ పిడి సిద్దలింగమూర్తి, మెప్నా పిడి నాగశివలీల, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

About Author