జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసిన.. కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్ర్రీ ఎన్. శ్రీనివాస రావుని బుధవారం జిల్లా కోర్టు లో కర్నూలు జిల్లా నూతన ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.పెండింగ్ కేసులను తగ్గించడానికి , లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యే విధంగా న్యాయశాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేసి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయటం పై చర్చించారు.బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం అందించేలా , పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.