ఆదానితో మోడీ చీకటి ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యుత్ కొనుగోలుపై ఆదానితో ప్రధాని మోడీ చీకటి ఒప్పందాలు అవినీతి కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, కోరుతూ మంగళవారం స్థానిక నాలుగు స్తంభాల కోడలు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదాని తో కుదిరించుకున్న చీకటి ఒప్పందాలను రద్దు చేయాలని, 1750 కోట్లు ఆదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ముడుపులని నిగ్గు తేల్చాలని ఈ సందర్భంగా సీపీఐ నాయకులు కోరారు.సిపిఐ నాయకులు రాజా సాహెబ్, సురేంద్ర కుమార్, కృష్ణయ్య, కారుమంచి, తిమ్మయ్య, నెట్టికంటయ్య, రంగన్న తదితరులు పాల్గొని సమస్యలతో కూడిన నెంబర్ వన్ స్థానిక తాసిల్దార్ కు సమర్పించారు.