PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అశేష త్యాగాల చరిత్ర గల పార్టీ ‘సీపీఐ’

1 min read

భూస్వామ్య,పెత్తందారీ విధానాలను మట్టుబెట్టిన పార్టీ ‘సీపీఐ

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో 5, వార్డ్ ఎన్టీఆర్ కాలనీలలో సిపిఐ సీనియర్ నాయకులు బి.బజారి సిపిఐ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సంద్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న, సిపిఐ మంత్రాలయం నాయకులు భాస్కర్ యాదవ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సమయుల్లా మాట్లాడుతూ*  సిపిఐ మనదేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కుల మత వర్గ  తరతమ్యాలు లేని సమ సమాజం కోసం పోరాడిందని ఆనాడు సమాజంలో జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలను రద్దు చేయాలని పెత్తందారులు పేదలు, పేద రైతాంగం పై సాగిస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని కార్మికులు కష్టజీవులకు శ్రమకు తగ్గ ఫలితం సాధించుటకు పోరాటం సాగించి విజయం సాధించిందన్నారు.  తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రామీణ పేదలను ఐక్యం చేసి నిజాం నిరంకుశ సైన్యానికి సైతం ఎదురొడ్డి పోరాడిందని రైతాంగాన్ని కూలీల పోరుబాటలో ఆనాడు భూస్వాములు అనుభవిస్తున్న పేదల భూములు 10 లక్షల ఎకరాల భూములను పేద కూలీలకు రైతాంగానికి పంచిన చరిత్ర సిపిఐ దన్నారు. మనువాదులు ధ్వంసం చేయాలని చూస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కుల మతాల పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే మత విద్వేషాలకు వ్యతిరేకంగా సిపిఐ అనేక దశాబ్దాలుగా పోరాడుతోందని అని పేర్కొన్నారు. నేడు కూడా కేంద్రంలో అటువంటి శక్తులు పెచ్చరిల్లిపోతున్న నేపద్యంలో మరోసారి మత ఉన్మాదాన్ని పెరిగిపోకుండా భిన్నత్వంలో ఏకత్వం గా బహుళ మతాలు కులాలు అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్న మనదేశంలో అందరినీ గౌరవించే విధానాన్ని కొనసాగించుటకు, దేశంలోని వామ పక్షవాదులను,లౌకిక శక్తులను ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించుటకు   సిపిఐ అనేక పోరాటాలు చేసిందని పార్టీ ఇచ్చిన భూమికోసం భుక్తి కోసం శ్రమజీవుల బడుగు జీవుల సమస్యల పరిష్కారం కోసం వారి ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు మౌలిక సమస్యల పరిష్కారం కొరకు అనేక పోరాటాలు చేసి అనేక పోలీసు కేసులు ఎదుర్కొని ప్రజలకు వేలాదిమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారి మౌలిక సమస్యలపై పోరాడి విజయం సాధించిన చరిత్ర సిపిఐదన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకొనుచు సిపిఐ నాయకత్వం ముందుకు సాగుతుందని నగరం కాలనీ ఇళ్లపట్టాలు మంచినీళ్లు కరెంటు తదితర సమస్యలను పరిష్కారం చేసుకొనవలసి ఉందని ఎర్రజెండా మన జరిపే పోరాటాలకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దాదావలి, మాలిక్, విజేంద్ర, మల్లికార్జున్ గౌడ్, నరసింహారెడ్డి,రంగస్వామి, రామాంజనేయులు,శీను, రాముడు,శ్రీరాములు,కృష్ణ, నరసింహులు,రవి,రాజేష్ లక్ష్మన్న,పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *