PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుంతలు పడిన రోడ్లను పరిశీలించిన సిపిఐ పార్టీ బృందం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ నగరంలోని 19వ వార్డు  గణేష్ నగర్ 1 గణేష్ నగర్ 2రెవిన్యూ కాలనీ నంద్యాల చెక్ పోస్ట్ 50వ నెంబర్ సచివాలయం దగ్గర రోడ్లన్నీ కూడా గుంతలు గుంతలు పడి వార్డులోని ప్రజలకు నరకాన్ని చూపిస్తున్న మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కాని ఎవరు కూడా రోడ్ల మరమ్మతులు చేయడంలో చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల దాకా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర నాయకత్వం పాడైపోయిన రోడ్లను పరిశీలించి స్థానికులతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది .ఈ కార్యక్రమాల్లో సిపిఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డినగర సహాయ కార్యదర్శి జి.చంద్రశేఖర్ నగర కార్మిక సభ్యులు u కుమార్ D సోమన్న కర్నూలు రూరల్ కార్యదర్శి B.సురేంద్ర యాదవ్ శాఖా కార్యదర్శులు మల్లేష్ .కుమార్ రాజా పార్టీ సభ్యులు రమేష్ సుధాకర్ అశోకు రాముడు మహేష్ పార్వతమ్మ  మార్తమ్మ ఈర్మియా రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలోని 19వ వార్డుకి మేయర్ ప్రాతినిత్యం వహిస్తున్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ వార్డు ఉన్నది .అధిక వర్షాల వల్ల నగరంలో రోడ్లు అన్నీ కూడా పాడైపోయినాయి ప్రజలు 19వ వార్డు లోని ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటే భయపడుతున్నారని రాత్రుల పూటైతే ముసలి వాళ్లు రోడ్లపై రావాలంటేనే భయపడుతున్నారని నంద్యాల చెక్పోస్ట్ సర్కిల్లో మోకాటి లోతు గుంత ఉన్నప్పటికీ అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు. కార్పొరేటర్ చోద్యం చూస్తున్నారు గుంతలు పూడ్చడానికి చర్యలు తీసుకోవడం లేదు 50వ సచివాలయం దగ్గర నడి రోడ్డుపై మోకాటి లోతు నీళ్లు ఆగి ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఆనీళ్లను తొలగించాలనే కనీసం జ్ఞానం లేకుండా మున్సిపల్ అధికారులు ఉన్నారని దీనికి నిరసనగా సిపిఐ పార్టీ నగర నాయకత్వం రోడ్లపై ఆగి ఉన్న నీళ్లలో పిచ్చి మొక్కలు నాటి నిరసన తెలియజేయడం జరిగినది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఎక్కడైతే రోడ్లు పాడైపోయాయో వాటన్నిటిని తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులను సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.

About Author