బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఐ నిరసనలు, ధర్నా కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిర్వహించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని బాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మహిళలు ఈ సందర్భంగా కోరారు. మొదటి దశలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గత నవంబర్లో గ్రామ సచివాలయం ముందు అర్జీలు ఇచ్చి నిరసనలు చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. రెండో దఫా నిరసనల్లో భాగంగా నేడు పత్తికొండ తహశీల్దార్ కార్యాలయం దగ్గర వ్యక్తిగత అర్జీల ద్వారా మహిళలు పెద్ద ఎత్తున నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాసిల్దార్ రమేష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పార్టీ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.