ఇంటి పట్టాలు ఇవ్వాలని మంత్రికి సిపిఐ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర సచివాలయంలోని 4 వ బ్లాకులో ఉన్న రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి కర్నూలు నగరంలోని 20వ వార్డు నందు పేదలు వేసుకొని నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సర్వేనెంబర్ 123 నందు 350 కుటుంబాలు వారికి పట్టాలు ఇవ్వాలని బి తాండ్రపాడు గ్రామ పరిధిలో ని సర్వే నెంబర్స్ 341/1,341/2. 342/2A 319 316 నందు దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి వీరందరూ కూడా నిరుపేదలే గత రెండు సంవత్సరాలుగా అక్కడే కొట్టాలి వేసుకుని నివాసం ఉంటున్నారని కావున వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కే రామకృష్ణ నాయకత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్ లెనిన్ బాబు కర్నూల్ సిపిఐ నగర పార్టీ కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి నగర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ వి నాగరాజు మంత్రి ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగినదిఅలాగే కోడుమూరు ఆలూరు పత్తికొండ ప్రాంతాలలో పేదలు కొట్టాలు వేసుకునివాస గత పది సంవత్సరాలుగా నివాసంఉంటున్న వాటన్నిటికీ కూడా పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కే.రామకృష్ణ నాయకత్వం మంత్రిని కొరగా మంత్రి మాట్లాడుతూ కచ్చితంగా ఈ సమస్యల పట్ల ఎంక్వయిరీ చేయించి పేదలందరికీ న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకుంటానని సిపిఐ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది.