సిపిఎం ఏలూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక
1 min readసిపిఎం జిల్లా 26వ మహాసభల్లో సిపిఎం ఏలూరు జిల్లా నూతన కార్యదర్శిగా ఎ.రవి ఎన్నికయ్యారు
సిపిఎం మహాసభల డిమాండ్ ..సిపిఎం నూతన కార్యవర్గ జిల్లా
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా డి.ఎన్.వి.డి. ప్రసాద్, ఆర్. లింగరాజు, తెల్లం రామకృష్ణ, జి. రాజు, ఎం. నాగమణి, కె. శ్రీనివాస్, పి. రామకృష్ణ ఎన్నికయ్యారు. మరో 16 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికయినట్లు ఎ.రవి తెలిపారు.18న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు దగ్ధంజిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఎం దశలవారీ ఉద్యమం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ప్రజలపై విద్యుత్, అధిక ధరల భారాలను ఉపసంహరించుక కోవాలన్నారు. అదేవిధంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం నిర్వహించాలని సిపిఎం నూతన జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో ఆందోళనలు, పోరాటాలు చేపట్టాలని సిపిఎం జిల్లా మహాసభలు పిలుపునిచ్చాయని వివరించారు.సోమవారం ఏలూరు పవరుపేటలోని ఉద్దరాజు రామం భవనంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ నెల 13,14,15 తేదీల్లో బుట్టాయిగూడెంలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలు తీర్మానాలను, నూతన కమిటీ వివరాలను నూతన జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటించారు. ఈ సమావేశంలో నూతన జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. లింగరాజు, డి.ఎన్.వి.డి. ప్రసాద్, కె. శ్రీనివాస్, పి.రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతూ స్వర్ణాప్రదేశ్ ఏలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ట్రూ అప్, సర్దుబాటు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో విద్యుత్ చార్జీలు వడ్డిస్తున్నారని విమర్శించారు. అసలు కంటే కొసరే అధికంగా జనంపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ పిపిసిఎ చార్జీల పేరట ప్రజలపై రూ.6072 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు ద్వంసం చేయాలని ప్రకటించిన కూటమి నేతలు ఎన్నికల అనంతరం స్మార్ట్ మీటర్ల బిగింపుకు ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపితే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఓడ ఎక్కేవరకు ఓడమల్లయ్య ఓడ దిగినతర్వాత బోడిమల్లయ్య అనే చందంగా అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక ఇంకొక మాట మాట్లాడటం సరికాదన్నారు. ఈ విద్యుత్ భారాలను ఉపసంహరించకపోతే పెద్దఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అదానీతో సెకీ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ ముడుపులతో కూడిన ఒప్పందాలని తెలినందున వాటిని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై అదనంగా లక్ష కోట్ల రూపాయల భారాలు మోపడానికి సిద్ధపడటం దారుణమన్నారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు అన్నింటీని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటి ఆధారంగా జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా అభివృద్ధికి ఏలూరు జిల్లా అమడదూరంలో ఉందన్నారు. ఇప్పటికైనా వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చేసి ఉపాధి, మౌలిక వసతులు కల్పించేలా అన్ని వర్గాల, తరగతుల ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.విదేశీ నిపుణులను ప్రాజెక్టు పరిశీలనకు తీసుకువస్తున్న ప్రభుత్వాలు సర్వం కోల్పోయిన నిర్వాసితుల గోడు వినేందుకు గ్రామస్థాయి అధికారులను కూడా పంపదంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సిపిఎం వ్యతిరేకం కాదని, ఐతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం, పునరావాసం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం జరగలంటే పోలవరం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలను గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఇళ్ళ స్థలాలు, భూములు వంటి సమస్యలు పరిష్కరించాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం తక్షణం పూర్తి చేసి మెట్ట ప్రాంత భూములకు సాగునీరు అందించాలని కోరారు. జిల్లా మహాసభల్లో ప్రజా సమస్యలపై 30 తీర్మానాలు ఆమోదించినట్లు ప్రకటించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలురైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు, యువజనులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.