PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రేజీ టాక్‌

1 min read

సినిమా డెస్క్​ : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఓ క్రేజీ టాక్‌ ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రజెంట్‌ మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ సినిమా క్లయిమాక్స్‌ సీన్స్‌ హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ని డిజైన్‌ చేశారట మేకర్స్‌. ఆ సాంగ్‌ కోసం తమన్నాని సంప్రదించారని సమాచారం. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లతో కూడా బిజీగా ఉన్న తమన్నా అల్లుడు శీను, జైలవకుశ, సరిలేరు నీకెవ్వరు సూపర్‌‌ హిట్‌ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో నటించింది. ఇప్పుడు ఈ మూవీకి కూడా తమన్నానే ఎంపిక చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌‌గా బాక్సింగ్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబీ, సిద్దు ముద్దా కలిసి నిర్మిస్తున్నారు. కాగా తమన్నా, వరుణ్​ తేజ్‌లిద్దరూ ‘ఎఫ్​ 2’లో వదినా, మరిదులుగా అలరించారు.

About Author