స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి …
1 min readకొత్త పంట రుణాలు మంజూరు చేయాలి…
ఏ.పీ.రైతు వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్….
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయ నిమిత్తం రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని అదేవిధంగా నూతన పంట రుణాలు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని,అలాగే రుణమాఫీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్, రైతు సంఘం మండల కార్యదర్శి సూరి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మహబూబ్ బాషా ఏ.పీ. రైతు సంఘం నాయకులు శ్రీరాములు లు డిమాండ్ చేశారు.బుధవారం నాడు మండలంలోని దేవనకొండ ,తెర్నేకల్లు, కోటకొండ గ్రామాల్లోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవనకొండ బ్యాంకు దగ్గర అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీర శేఖర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులు వ్యవసాయం కోసం పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, మరియి ప్రవేట్ వ్యక్తుల దగ్గర విరివిగా అప్పులు కొరకు ప్రయత్నం చేస్తున్నారని, పెరుగుతున్న మందులు ఎరువులు, విత్తనాలు ధరలు రైతులకు నానాటికి భారమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ బ్యాంకులు మాత్రం రెన్యువల్ కే పరిమితమవుతూ రైతులకు వ్యవసాయానికి సహాయం చేయడంలో ముందడుగు వేయడం లేదని అన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని కోరారు.అదేవిధంగా రైతులను ప్రైవేటు బ్యాంకులో మరియు ప్రైవేటు వ్యక్తుల నుండి కాపాడాలని కోరారు. కొత్త పంట రుణాలు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని, కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న రుణమాఫీ.