శ్రీమద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సందడి
1 min readశ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గోటి వలపు తలంబ్రాలు కార్యక్రమం
ప్రారంభించిన కార్య నిర్వహణ అధికారిని ఆర్.వి చందన
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఈరోజు ”శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి” వారి ఆద్వర్యంలో భద్రాచలం సీతారాముల కళ్యాణమహోత్సవంనకు తలంబ్రాల నిమిత్తం ధాన్యం గోటితో వలుచు కార్యక్రమంను ప్రారంభించారు.సదరు కార్యక్రమమును ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన ప్రారంభించారు. సదరు కార్యక్రమముపై ప్రముఖ ఆద్యాత్మికవేత్త కె.ఎల్.ఎన్. ధనకుమార్ ఉపన్యసించారు.భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రంనందు అన్నప్రసాద వితరణ చేశారు.ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన తెలిపారు.