సుంకేసులలో దళితుడికి చిత్రహింసలు..
1 min readఅవసరమైతే ఎస్పీకి ఫిర్యాదు:ప్రజా సంఘాలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): దళిత యువకుడిని బుధవారం తెల్లవారు జామున ఇంట్లోకి బలవంతంగా పిలుచుకొని దళితునికి చిత్రహింసలు పెట్టిన సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో చోటు చేసుకుంది.దళితునిపై జరిగిన దాడిని ప్రజా సంఘాల నాయకులు భగ్గు మన్నాయి. మిడుతూరు మండలంలోని సుంకేసుల గ్రామంలో దళిత యువకుడు మాల అందే దేవరాజు ను ఇదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వాళ్లు వైసీపీ నాయకులు భరత్ కుమార్ శర్మ మరియు అతని అనుచరులు ఇంటికి పిలిపించుకొని కిరాతకంగా దాదాడి చేసి అవమానంగా కొట్టి చిత్రహింసలకు గురి చేయడం పట్ల నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకులు మిడుతూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్,ఎమ్మార్పీఎస్ రాజు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి బాధితులకు అండగా నిలిచారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక దళితుడిని ఇంట్లోకి పిలుచుకొని దాడి కులం పేరుతో దూషించడం వంటలు చేయడం భరత్ కుమార్ శర్మ అతని అనుచరులకు మంచి పద్ధతి కాదని దాడి చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా వారికి కఠిన శిక్ష పడే విధంగా సెక్షన్లు ఉండే విధంగా పోలీసులు చూడాలని దళితులపై ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని ఈ బాధితులకు న్యాయం జరిగిన పక్షంలో జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్తామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేయడం అన్యాయమని దాడులను ఎవరు ప్రోత్సహించినా వాటిని సహించే ప్రసక్తే లేదని ప్రజా సంఘాల నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఇనాయతుల్ల,ఎలీషా,పుల్లన్న మరియు బాధితులు పాల్గొన్నారు.