రోగి వాడే మందుల వల్ల మరణం ఆమోదయోగ్యం కాదు ..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ అన్నారు. మెడికల్ కాలేజ్ లోని ఫార్మకాలజీ విభాగపు అధిపతి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు “ఫార్మకో విజిలెన్స్ వీక్” నిర్వహించడం జరిగింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఫార్మకాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రోగం వల్ల మరణం కొన్నిసార్లు అనివార్యం కావచ్చునని అయితే మందుల వల్ల దుష్పరిమాణాలు ఏర్పడరాదని వాటిని నివారించడానికి ఏర్పడిందే “ఫార్మకో విజిలెన్స్” అని ఆమె అన్నారు. గత వారం రోజులుగా అవగాహన కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన పోటీలలో ప్రతిబ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్ డాక్టర్ విజయ ఆనందబాబు, ప్రొఫెసర్ లక్ష్మీ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.