మాజీ వార్డెన్ కురువ రాముడు మృతి తీరని లోటు
1 min readకర్నూలు జిల్లా కురువ సంఘం…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఏరుకలచెరువు గ్రామంలో కురువ రాముడు జన్మించినాడు. ఆయన విద్యాభ్యాసం ప్యాపిలి కర్నూలు అనంతపురంలో జరిగింది వార్డెన్ గా కోడుమూరు మండలం లద్దగిరి , మంత్రాలయం ,కర్నూలు బాలుర హాస్టల్ లో కురువ రాముడు వార్డెన్ గా పనిచేసి పదోన్నతి పై సహాయ సంక్షేమ అధికారిగా కడప లో 2011 లో పదవీ విరమణ పొందారు .ఆయన భార్య అనారోగ్యంతో 2007 లో మరణించారు .వారికీ ఇద్దరు కూతుళ్లు ,ఒక కుమారుడు . ఉద్యోగరీత్యా ప్రస్తుతం అమెరికా లో ఉన్నారు .వీరు గత నెల రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో అనారోగ్యం తో చికి త్స పొందినారు ., నిన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో చేరిన మాజీ వార్డెన్ రాముడు ఈ రోజు మధ్యాహ్నం మరణించారు .వీరు ఎంతోమంది విద్యార్థులకు విద్యతో పాటు చక్కని క్రమశిక్షణను నేర్పారు .కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న మాట్లాడుతూ రాముడు మృతి కురువ కులానికి తీరని లోటని విద్యాభ్యాసం సమయంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో పదవి విరమణ తరువాత కూడా కులానికి ఎంతో సేవ చేశారని రాముడు మృతి తీరని లోటని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కురువ సంఘం అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ఎం.కే .రంగస్వామి ,అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న , జిల్లా ఉపాధ్యక్షులు కే .టి .ఉరుకుందు ,ధనుంజయ కోశాధికారి కే .సి .నాగన్న,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు కొత్తపల్లి దేవేంద్ర ,బి .రామకృష్ణ ,బి .సి .తిరుపాల్ ,పుల్లన్న ,పత్తికొండ సురేంద్ర సంతాపము తెలిపారు .