దసరా కానుకగా ఐ ఆర్ ప్రకటించండి.. ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గతంలో ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దసరా కానుకగా పెండింగ్ డీఏలను, పిఆర్సి, మధ్యంతర భృతి లాంటివి ప్రకటించడం ఆనవాయితీ అని అందరికీ విధితమే,గత ప్రభుత్వం గత సంవత్సరం జూలైలోనే 12వ పిఆర్సి కోసం కమిటీని వేయడం జరిగిందని, కమిటీ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాలవల్ల తప్పుకోవడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం నూతన వేతన సవరణ కోసం కమిటీ నూతన చైర్మన్ ను వెంటనే నియమించి, దసరా కానుకగా మధ్యంతర భృతి (ఐ ఆర్) ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్)రాష్ట్ర అధ్యక్షులు శవన్న బాలాజీ ప్రధాన కార్యదర్శి జివి సత్యనారాయణ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.వారు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం పై లక్షలాదిమంది ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారికి గతంలో రావలసిన ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు రావలసిన 90 శాతం డి ఏ బకాయిలు ఇంతవరకు సంవత్సరాలు గడుస్తున్నా వారికి అందలేదని, దసరా కానుకగా ఉద్యోగులకు శుభవార్త ప్రకటించాలని ఎస్ బాలాజీరాష్ట్ర అధ్యక్షులుఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేశారు.