PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నూరులో శ్రీ లలితా దేవి అలంకారం

1 min read

శ్రీ గజలక్ష్మి దేవి అలంకారంతో అమ్మవార్లు భక్తులకు దర్శనం

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చెన్నూరు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం ఆరవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ . అభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు అమ్మవారు శ్రీ లలితా దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అలంకారం ఉభయ దారులు మరియు ప్రసాద ఉభయ దారులు ఇండ్ల వద్ద నుంచి మేళ తాళాలతో అమ్మవారి సూత్రాలు పాడుతూ అమ్మవారి అలా వరకు ప్రసాదాలను తీసుకువచ్చారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారు శ్రీ గజలక్ష్మి దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందించారు. శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా చౌడేశ్వరి దేవి ఆలయం. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి రెండు ఆలయాలకు ఆరవ రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఎక్కువగా మహిళలు తరలివచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *