దీనజన బాంధవుడు ఎన్టీఆర్….
1 min readఘనంగా నివాళులర్పించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పెద్ద ఎత్తున రక్తదానానికి పోటీపడ్డ నాయకులు, యువకులు,కార్యకర్తలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: రక్తదానం చేసిన 50 మంది నాయకులు, కార్యకర్తలు. పేద వర్గాలను అన్నివిధాలా ఆదుకున్న మహనీయులు ఎన్టీ రామారావు ఒక్కరేనని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ. తెలుగుదేశం పార్టీ ఎన్నో ట్రస్టుల ద్వారా ఎంతోమందికి చేయూతనిందిస్తోందని చెప్పారు. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. అనతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా పెద్ద ఎత్తున పోటీపడి మరి నాయకులు, యువత,నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల పాటు వెండి తెర రారాజుగా వెలుగొందిన స్వర్గీయ ఎన్టీఆర్ 1982లో అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించి, తొమ్మిది నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించి, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఆ సమయంలో చింతలపూడి రోడ్డులో జరిగిన ఎన్టీఆర్ సభకు తాను హాజరైయ్యానని, అదే పార్టీలో ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉండడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. 1983లో ఎన్టీఆర్ అద్భుత విజయంతో చరిత్ర సృష్టిస్తే. 2024 లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ చరిత్రను తిరగరాసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్, భవనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ట్రస్టుతో ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమానికి గడచిన ఆరు నెలలుగా అంకితభావంతో కృషిచేస్తున్నానని చెప్పారు. ఈ ఆరు నెలల్లో సామాన్యుని పరిస్థితి ఏంటో అందరూ గుర్తించారని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమాన్ని వారు అందుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడు నెలల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని, 2025 సంవత్సరం కార్యకర్తలకే సొంతమన్న విషయం త్వరలో పార్టీ అధినేత తన చేతల ద్వారా చేసిచూపిస్తారని బడేటి చంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, లంకపల్లి మాణిక్యాలరావు,పార్టీ నాయకులు ఎంబిఎస్ శర్మ, పూజారి నిరంజన్, నేరుసు గంగరాజు, మారం అను, దాకారపు రాజేశ్వరరావు, వందనాల శ్రీను, ఆర్నేపల్లి తిరుపతి, బొద్దాని శ్రీనివాస్, బెజ్జం రాజేష్ పుత్ర, చిన్ని అర్జున్, కడియాల విజయలక్ష్మీ, తవ్వా అరుణకుమారి, బెజ్జం అచ్చాయమ్మ, మంత్రి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.