బడ్జెట్ పేరుతో రక్షణ కరువు. ..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో బడ్జెట్ పేరుతో భక్తులకు రక్షణ కరువు అయింది. గతంలో ఎనిమిది మంది వివిధ షిప్టుల్లో క్షేత్రంలో హోంగార్డ్స్ క్షేత్రానికి భక్తులకు రక్షణ కల్పించేవారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా క్షేత్రంలో నీ ప్రధాన ముఖద్వారం, పెద్ద మరియు చిన్న కోనేరు ల వద్ద విధులు నిర్వహించేవారు. కానీ బడ్జెట్ అధికమవుతున్న కారణం చేత ఇద్దరిని మాత్రమే రక్షణ కోసం దేవస్థానం అధికారులు హోంగార్డుల ను నియమించుకోవడం తో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేసే సమయంలో వారంలో కనీసం మూడుసార్లు గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కోనేరుల వద్ద కూడా తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆలయ ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేసే సమయంలో దేవస్థానం సిబ్బంది కానీ హోంగార్డులు గాని లేకపోవడం వల్లనే తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికంతటికీ కారణం బడ్జెట్ పద్మనాభం అని సమాచారం. భక్తులకు రక్షణ కల్పించాల్సిన దేవస్థానం అధికారులు బడ్జెట్ పద్మనాభం పేరుతో ఎన్ని గొడవలు ,ఎన్ని వివాదాలు జరుగుతున్న పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకానొక దశలో హోంగార్డులు కూడా మహానంది దేవస్థానంలో విధులు నిర్వహించాలంటే బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. ఇద్దరూ లేక ముగ్గురు ఉండాల్సిన స్థానంలో ఒకరిని మాత్రమే హోంగార్డులను కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రంలోని చెప్పుల స్టాండు, సెల్ఫోన్ భద్రపరిచే ప్రాంతం మరియు పూజా సామాగ్రి విక్రయించే ప్రాంతాలతో పాటు కోనేరుల వద్ద కూడా గొడవలు ,వివాదాలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు కో కొల్లలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు ఏమైపోతే మాకేంటి మా బడ్జెట్ మాది, భక్తుల భద్రత భక్తులే చూసుకోవాలి అని గాలికి దేవస్థానం అధికారులు వదిలేసినట్లు తెలుస్తుంది.