ఆదోనిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయండి
1 min readవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే డా. పార్థసారధి
అమరావతి, పల్లెవెలుగు: రాయలసీమలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన ఆదోనిలో ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డా. పార్థసారధి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. డివిజన్ కేంద్రమైన ఆదోనిలో 2.7 లక్షల జనాభా ఉన్నారని, కానీ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో లేకపోవడంతో యువత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు కట్ట లేక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, దీంతో యువత వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదోనిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే డా. పార్థసారధి కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విశ్రాంతి సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేశానని, ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డా. పార్థసారధి శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.