చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వై. నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుచిలకలూరిపేటలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దలవెంకట కోటయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీలను విద్యాపరంగా ఆర్థికపరంగా రాజకీయపరంగా సామాజికపరంగా అభివృద్ధి చెందాలని, దేశంలోనూ రాష్ట్రంలోనూ బీసీలు 50% కంటే జనాభా ఎక్కువగా ఉన్నారు. బీసీలు అనేక వృత్తుల ద్వారా సంపద అందిస్తున్నారు. ఆ సంపదను బీసీలలో వెనుకబాటులో ఉన్నారో వారికి చేరాలి. బీసీలు విద్యాపరంగా అభివృద్ధి చెందుతారరో అప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు ఆర్ కృష్ణయ్య ద్వారా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే అనేక స్కాలర్షిప్లు, కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు చదవడానికి కృషిచేసిన సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం. గత ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించి బీసీలకు స్కాలర్షిప్లను ఇవ్వకుండా అలాగే స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు 24% శాతానికి తగ్గించి ఎలక్షన్లు జరిపించడం వల్ల బీసీలు అనేక పదవులు కోల్పోవడం జరిగింది. వాటిని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ లో బీసీ లకు అన్ని జిల్లాలలో బీసీ భవనాలను నిర్మిస్తామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయ పరమైన పోరాటం, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషనన్లు, బీసీ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్ల తక్షణ మరమ్మతులకు ముఖ్యమంత్రి ఆదేశం, స్కిల్ ఎడ్యుకేషన్ కోసం 104 బీసీ హాస్టళ్లలో ఎస్.ఆర్.శంకరన్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పార్లమెంటు నందు బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ నామినేటెడ్ పోస్టులలో 50% కల్పించాలని అలాగే బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ ను కేటాయించి ఆర్థిక వెసులుబాటు బీసీలకు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మా డిమాండ్లు నెరవేరే వరకు గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు అనేక పోరాటాలు చేస్తామని సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది .