PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశంలో మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని డిమాండ్

1 min read

సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ విద్యార్థులు, సెయింట్ ఆన్స్ కాలేజీ విద్యార్థులు ప్లేకార్డులతో భారీ ర్యాలీ

కదం తొక్కిన విద్యార్థిని విద్యార్థులు, నగరంలో స్తంభించిన ట్రాఫిక్

ఫైర్ స్టేషన్ వద్ద భారీ మానవహారం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పశ్చిమ బెంగాల్లో మేడికో ట్రైని మహిళా డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన ఘటన నిరసిస్తూ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ.సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, దుగ్గిరాల డెంటల్ కాలేజీ అధ్యాపకులు విద్యార్థులు సెంట్ జోసఫ్ అధ్యాపకులు విద్యార్థులు సెయింట్ జాన్స్ అధ్యాపకులు విద్యార్థులు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ర్యాలీ సెయింట్ ఆన్స్ మహిళ కళాశాల నుండి ప్రారంభమై అమీనాపేట పోలీస్ కళ్యాణ మండపం ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగింది అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. నగరంలో కాలేజీల విద్యార్థిని, విద్యార్థులు భారీ సంఖ్యలో కదం తొక్కారు. నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.ఈ సందర్భంగా  తెరిసా కాలేజీ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ డాక్టర్  మెర్సీ ,ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ శ్యామల రాణి సెంటెన్స్ కాలేజ్ విద్యార్థి వి.అంబిక డెంటల్ కాలేజ్ విద్యార్థి  మాట్లాడుతూ బెంగాల్ మేడికో ట్రైనింగ్ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య సమాజం తలదించుకునేలా ఉన్నదని అన్నారు. కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ సమాజంలో ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు.ఏలూరులోని గత ఆరు మాసాలలో ఆరుగురిపై హత్య అత్యాచార ఘటనలు వెలుగు చూస్తాయని అన్నారు . సమాజంలో మహిళలను రెండవ తరగతి పౌరులుగా చూసే సంస్కృతి పోవాలని అన్నారు. సినిమాలు సాహిత్యం ఇంటర్నెట్ మాధ్యమాలలో హింస, క్రూరమైన సన్నివేశాలు, రాసలీలలు, అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నిచోట్ల ఏర్పాటుచేసినా దోషులకు  వెంటనే కఠిన శిక్షలు పడేలా చూడాలని నిర్భయ ఉదాంతం సందర్భంగా జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు కోరుతున్న విధంగా వారు విశ్రాంతి తీసుకోవడానికి సెక్యూరిటీ కి తక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠ్యాంశాల మొదలుకొని పిల్లలకు చిన్నప్పటినుండే మహిళలను గౌరవించడం నేర్పించాలని దానికి అనువైన పాఠ్యాంశాలు పిల్లలకి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సెంటర్లో విద్యార్థులు మహిళలు చిన్నారిపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేకంగా స్కిట్లు ప్రదర్శించారు. ఇవి చూపరులను ఆకట్టుకున్నాయి.ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ టి  కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్  సుశీల, ఎన్ఎస్ఎస్ సెల్, ఉమెన్స్  సెల్ ఆధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.సెయింట్ జోసెఫ్ కాలేజ్ దుగ్గిరాల కరస్పాండెంట్ మోసేజ్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్  స్లివ రాజు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు, ఐద్వా, జిల్లా అధ్యక్షురాలు పి హైమావతి నాయకులు జయ హరీష్ దుర్గ, డివైఎఫ్ఐ నాయకులు పి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author