ఏపీజీబీలో…‘ డిపాజిట్’ చేయండి..
1 min readఅధిక వడ్డీ రేట్లు పొందండి..
- డిపాజిట్ మొబిలైజేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించండి..
- సిబ్బందిని ఆదేశించిన ఏపీజీబీ రీజనల్ మేనేజర్ పి.ఎస్. నవీన్ కుమార్
కర్నూలు, పల్లెవెలుగు: ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు… సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో తమ బ్యాంకు ముందుంటుందన్నారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ పి.ఎస్. నవీన్ కుమార్. బ్యాంకు దగ్గరకు వచ్చి డిపాజిట్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏపీజీపీలో డిపాజిట్ చేసేందుకు డిపాజిట్ మొబైలైజేషన్ ను ఏర్పాటు చేశామని, గ్రామీణ, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది మరియు కిసాన్ నగర్ బ్రాంచి, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ బ్రాంచి మరియు జనరల్ హాస్పిటల్ బ్రాంచుల వారు సంయుక్తంగా నిర్వహించిన ఫీట్ ఆన్ స్ట్రీట్(డిపాజిట్ మోబిలైసెషన్)కార్యక్రమానికి రీజినల్ మేనేజర్ P S నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిపాజిట్ దారులకు తమ బ్యాంకులో ఇస్తున్న వడ్డీ రేట్లను వివరించాలని సూచించారు. ఆ ఆ తరువాత బ్యాంకు సిబ్బంది డిపాజిట్‌లపై బ్యాంకు అందిస్తున్న వడ్డీ రేట్లకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమం లో ప్రాంతీయ కార్యాలయ సీనియర్ మేనేజర్ నరేంద్ర కుమార్, మేనేజర్ రమణ కుమార్ తో పాటు మూడు శాఖ ల సిబంది కూడా పాల్గొన్నారు.