PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ ఎస్టీ హక్కులను హరించడం విరుద్ధం

1 min read

సుప్రీంకోర్టు తీర్పును పున సమీక్షించాలి

మాల సంఘాల జేఏసీ కాసరపు వెంకటేష్,శామ్యూల్

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : సుప్రీం కోర్టు సాక్షిగా భారత రాజ్యాంగం ఖూనీ చేసి ఎస్సీ ఎస్టీ కులాల హక్కులను హరించడం భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని మాల సంఘం జేఏసీ నాయకులు కాసారపు వెంకటేష్,పి రాజీవ్ కుమార్, చిటికెల శామ్యూల్ అన్నారు. శుక్రవారం కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 341 లను కూనిచేస్తూ వాటిని పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిల్లా ధర్మాసనం తీర్పునివ్వడం చాలా దుర్మార్గం షెడ్యూల్ కులాలు షెడ్యూలు తెగలకు ప్రత్యేక హక్కులు ఒక పొందుపరిచే వాటిని ఒక సమూహంగా చేర్చడం జరిగింది  ఈ తీర్పును 9 మంది జడ్జిల ధర్మాసనం ముందు  అప్పీల్ చేయబోతున్నాం తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీ బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ లోని మాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉద్యమంలో కలిసి రావాలని లేనిచో వారి ఇల్లు ముట్టడిచ్చి వారి నుంచే ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకొని వెళ్తామని కలిసివచ్చే ప్రజాస్వామ్యవాదులు భారత రాజ్యాంగ పరిరక్షకులు కలుపుకొని వెళ్తామని తెలియజేయడమైనది గతంలో ఓటు బ్యాంకు రాజకీయాలతో కేవలం విద్వేషాలతో మాల మాదిగల మధ్య చిచ్చు రగిలించి రాజకీయ లబ్ధి కోసం నాటి తెలుగు దేశం నుంచి నేడు ఎన్డీఏ ప్రభత్వం వరకు ఈ యొక్క రాజకీయాల్లో మాలలు బలి పశువులు అయ్యారని అయినా ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా భారత రాజ్యాంగం అనేటటువంటి ఆయుధం ద్వారా దాదాపు 30 సంవత్సరాలు పోరాటం చేయడమైనది కారంచేడు ఉద్యమం చుండూరు ఉద్యమం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో మాలల చైతన్యాన్ని మాలల ఉద్యమ స్ఫూర్తిని గమనించిన అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టాయని మాల సంఘాల జేఏసీ విరుచుకు మండిపడ్డారు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని లేనిచో ఈ కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బుటూరి మహేష్,సత్రి నారాయణ,  డి.స్వాములు,ఆనందరావు బంగి నాగన్న,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author