గోకులం శెడ్ల నిర్మాణాలను సందర్శించిన పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గోకులం శెడ్ల నిర్మాణాలను సంచాలకులు వెంకటరమణ శుక్రవారం సందర్శించి, పర్యవేక్షించారు. పశువుల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పశుగణాభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం 90%సబ్సిడీతో గోకులం శేడ్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్తికొండమండలం పుచ్చకాయల మాడ గ్రామాన్ని సందర్శించినప్పుడు రైతులకు గోకులం షెడ్లను రైతులకు విరివిగా మంజూరు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అసమర్థక శాఖ చేపట్టిన గణాంక సర్వేకు పశువుల రైతులు భాగస్వాములు కావాలని కోరారు. సీఎం పాడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా గోకులం షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పశు పోషణ మెలకువలు తెలుసుకొని రైతులు పాల ఉత్పత్తులు వృద్ధి చేసుకోవడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని అర్జించవచ్చని సూచించారు.ఈ సందర్భంగా ఉప సంచాలకులు పశుఘనాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక పథకాల గురించి వారికి వివరించారు. స్థానిక వెటర్నరీ డాక్టర్ లక్ష్మన్న, వెటర్నరీ అసిస్టెంట్ కావ్య శ్రీ ఆయన వెంట ఉన్నారు.