పంటల్లో చీడపీడల నియంత్రణకు మొబైల్ యాప్ రూపకల్పన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పంటల్లో చీడపీడల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వ భారత వ్యవసాయ శాఖ వారిచే ఒక మొబైల్ యాప్ ను రూపొందించడం జరిగినది దీనిని జాతీయ చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థ పర్యవేక్షించడం జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ (CIPMC), విజయవాడ నుండి కె. వీరయ్య చౌదరి మరియు సురేష్ కాంబ్లీ అను ఇద్దరు చీడపీడల నియంత్రణ అధికారులు ఈరోజు కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాల నుండి వచ్చిన 20 మంది రైతులు ,14 మంది స్కౌట్స్ అనగా వ్యవసాయ అధికారులు మరియు జిల్లా వనరుల కేంద్ర సిబ్బంది కి జాతీయ చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మొబైల్ యాప్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులు నేరుగా వారి ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ద్వారా పంటలను ఆశించినటువంటి చీడపీడల యొక్క ఫొటోస్ తీసి ఎన్ పి ఎస్ ఎస్ (NPSS) మొబైల్ యాప్ లో అప్లోడ్ చేసిన వెంటనే ఆ చీడపీడలను గుర్తించడమే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను సైతం సూచిస్తుంది. కీలకమైన పురుగులు మరియు తెగుళ్ల ఉధృతి సమాచారం అందించగానే ఆ ఉధృతికి తగ్గట్టుగా చీడపీడల నివారణ చర్యలను ఈ యాప్ సిఫారసు చేస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నందు గల సెమినార్ హాల్ నందు నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి పి.ఎల్. వరలక్ష్మి, జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి అన్నపూర్ణ మరియు సాంకేతిక అధికారి ఎస్ .అల్లీ పిరా మొదలగువారు పాల్గొన్నారు.