PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విలీనంతో పాఠశాలల విధ్వంసం..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;

గత సర్కార్ అత్యుత్సాహంతో 117 జీవో అమలు.

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుస‌రించి రాష్ట్ర ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నామంటూ హడావిడిగా గత వైసిపి ప్రభుత్వం  కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా మూడు రకాల విద్యాసంస్థలుగా విభజించి. ప్రాథమిక పాఠశాలల్లో ఇక నుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా . వీటి త‌ర్వాత‌.. ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) . అనంతరం మిడిల్‌ స్కూళ్లు (6–8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయని. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయని. హడావుడిగా 117 జీవో తెచ్చింది  ప్రభుత్వ ఆదేశాల మేరకు గడివేముల లో దాదాపు 250 మీటర్ల పరిధిలోని ఎం పి పి ఎస్ మరియు ఉర్దూ ప్రైమరీ పరిధిలోని దాదాపు 120 మంది విద్యార్థులకు  జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు 3 4 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు హై స్కూల్ ఆవరణంలోని పాఠశాల గదిలో విద్యాబోధన చేస్తున్నట్టు నాడు నేడు కింద నిర్మాణంలో ఉన్న కొత్త గదులను 2023 లో కేటాయించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని బిజెపి పాలిత రాష్ట్రాలే అమలు చేయడానికి నిరాకరించిన గత వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహంతో హడావుడిగా 117 జీవో ఇచ్చి అమలు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. ఈ విషయం గతంలో టిడిపి నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో ప్రభుత్వ విధానాన్ని విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించి ప్రత్యేకంగా వినతి పత్రాలు అందజేశాయి. దీనికి సానుకూలంగా స్పందించిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే వెంటనే జీవోను రద్దు చేస్తామని మళ్లీ విద్య వ్యవస్థను పునర్ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు.. ముఖ్యంగా గడివేములలో ఉర్దూ పాఠశాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిపోయింది సరైన రహదారి విద్యుత్ తాగునీరు లేక ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు గతంలో 40 మంది విద్యార్థులతో పాఠశాల కళకళలాడింది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండాలంటే బయట నుండి నీళ్లు తెచ్చుకొని వంట చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మధ్యాహ్నం భోజన నిర్వహకులు వాపోయారు సరైన వసతులు లేవని పాఠశాలలో విద్యుత్ లేదని పాఠశాల ఎదురుగా చెరువులా  మురికి నీరు నిలబడి కంపు కొడుతుందని దోమలు ఈగలతో  సహవాసం చేస్తున్నామని ఉపాధ్యాయురాలు వాపోయారు. పలుమార్లు మండల విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లిన స్పందన లేదని చుట్టుపక్కల ఉన్న ఇళ్ల నుంచి విద్యార్థులు విద్యా బోధనకు ఆసక్తి చూపటం లేదని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.. ప్రజలకు ఇష్టం లేకున్నా ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇటువంటి వాటిని బలవంతంగా రుద్దడం ఏ మేరకు సమంజసం. రోజుకొక విద్యా విధానం అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందుల పాలు చేస్తున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పునర్ వైభవం దిశగా అడుగులు వేస్తే ఈ సరస్వతి నిలయాలు ఎంతో మంది విద్యార్థులను భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా తయారు చేయొచ్చు.. మరి ఆ దిశగా కొత్తగా ఏర్పాటు అయిన టిడిపి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

About Author