వెనకబడిన మంత్రాలయం ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం – ఎంపీ
1 min readకూటమి నాయకులకు, కార్యకర్తలకు మండల అధికారులు గౌరవించి పనులు చేయాలి
మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. మాధవరం రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: కర్నూలు పార్లమెంటు పరిధిలోని మంత్రాలయం నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి లు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిలకలడోన లో ఎంపిడిఓ మణిమంజరి అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వీరి కి స్థానిక టిడిపి నాయకులు బోయ తిక్కయ్య అధ్వర్యంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటింటికి వెళుతు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియచేశారు. అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం గా మంత్రాలయం ఉందని. తెలిపారు. దీనిని అభివృద్ధిలోను అక్షరాస్యతలోనూ ముందుకు నడిపించడమే నా లక్ష్యం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని తెలిపారు. మాధవరం రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మండల కార్యాలయాల్లో కూటమి నాయకులకు కార్యకర్తలకు తగిన గౌరవం ఇస్తూ న్యాయబద్దంగా ఉన్న పనులను పూర్తి చేసి సహకరించాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం లో మా నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కొంత మంది అధికారులు వైకాపా నేతలు చెప్పినట్లు విని మా వారిని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న, బిజెపి ఇన్చార్జ్ మాధవరం విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, ఎస్ యం గోపాల్ రెడ్డి, మాలపల్లి మాజీ సర్పంచ్ చావిడి వెంకటేష్, చిలకలడోణ హనుమంతు, స్పెషల్ ఆఫీసర్ నారాయణ మూర్తి, సిఐ రామాంజులు, మాధవరం ఎస్సై విజయ కుమార్, సచివాలయం సిబ్బంది,పోలీస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఇష్రాక్ బాష జనసేన యేసేబు ,బిజెపి శ్రీరామ కోటి, హనుమంతు, తిక్కయ్య,రామకృష్ణ,శ్రీను, రఘు,రామకృష్ణ రాజశేఖర్,నరసింహులు, నివాస్, ప్రతాప్ మాలపల్లి లక్ష్మన్న, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.