సమాజ అభివృద్ధిలో భాగస్వాములుకండి..
1 min readశ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల అధినేత డా. హరి కిషన్
కర్నూలు, పల్లెవెలుగు:సమాజ అభివృద్ధిలో మీడియా భాగస్వాములు కావాలని సూచించారు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల అధినేత డా. హరి కిషన్. నగరంలోని శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాలలో పల్లెవెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. హరి కిషన్ మాట్లాడుతూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పల్లెవెలుగు దినపత్రిక ముందుండటం అభినందనీయమన్నారు. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించే మీడియా.. దేశాభివృద్ధిలోనూ ప్రధాన పాత్ర పోషించాలన్నారు. భవిష్యత్ లోనూ సమాజ అభివృద్ధికి దోహదపడే కథనాలు ప్రచురించాలని ఈ సందర్భంగా డా. హరి కిషన్ సూచించారు. కార్యక్రమంలో హిస్టరి లెక్చరర్ మద్దిలేటి, సిబ్బంది ఉన్నారు.