యాజమాన్య కమిటీలతో పాఠశాలల్లో అభివృద్ధి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల అధికారులతో ఏర్పాటు చేయబోయే పాఠశాల యాజమాన్య కమిటీలతో పాఠశాలల్లో అభివృద్ధి జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు(1,2) గంగిరెడ్డి, సునీతాలు పేర్కొన్నారు .పాఠశాల యాజమాన్య కమిటీ ఒకరోజు శిక్షణా తరగతుల్లో భాగంగా చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎంఈఓ లు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ,అధికారుల .ముఖ్యంగా యాజమాన్య కమిటీ ఎన్నిక విధానం ,విధులు-బాధ్యతలు ,పాఠశాలలో అభివృద్ధి ,ఆరోగ్యం కోసం పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలోభాగంగా పాఠశాలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, మొక్కలు పెంపకం, పాఠశాలలో చదువుతూ బడికిరాకుండా ఉండే వారినిపాఠశాలలకు ఎలా హాజరు పరచాలి? విద్యార్థులకు చదువుకునేందుకు ఎటువంటి విద్యా సదుపాయాలు కల్పించాలి ,మధ్యాహ్నం భోజన పథకంలో వంట ఏజెన్సీల బాధ్యత ఎలా నిర్వర్తించాలి ,పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణ నిధి విషయం తోపాటు వాటివిధులు ,బాధ్యతలు, మనబడి -మన భవిష్యత్తు అనే అంశంపై ప్రధానోపాధ్యాయులకు, కమిటీ చైర్మన్ లకు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించి పాఠశాల అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రణాళికలు తయారుచేసి వాటిని అమలు చేయాలి, .పాఠశాలలో జరిగే అన్ని విషయాలపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని కూడా భాగస్వాములను చేసుకొని సహాయకులుగా తయారు చేయాలన్నారు. పాఠశాలలో పిల్లల హాజరు పెంచడం పట్ల ఉపాధ్యాయుల విధులు బాధ్యతలు ఏ విధంగా ఉండాలో తెలియజేశారు .అలాగే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం ఎలా అనే విషయంపై ప్రణాళికలు తయారు చేసుకోవడంపై అన్ని వివరించారు. వీటన్నింటిని పాఠశాల యాజమాన్యం కమిటీ సభ్యులందరూ సక్రమంగా నివర్తిస్తే పాఠశాల అభివృద్ధి సజావుగా సాగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్ .పి .సి .ఖాదర్బాషా ,విద్యా కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.