PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గౌరవంతో కూడిన రాజకీయం, అభివృద్ధితో కూడిన ఏపీ స్థాపనే ధ్యేయం

1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

వైసిపి ని వదిలి టిడిపిలోకి వెళ్లిన కార్పొరేటర్లు, నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గౌరవంతో కూడిన రాజకీయం, అభివృద్ధితో చెందిన ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా అభివృద్ధి ప్రదాతా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సువర్ణ పాలనను అందిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అదేస్ఫూర్తితో ఏలూరు నియోజకవర్గంలో ఆదర్శవంతమైన పాలనకు తాను కూడా శ్రీకారం చుట్టానని ఆయన వెల్లడించారు. ఏలూరు నియోజకవర్గంలోని వైసిపికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో ఏలూరు కార్పొరేషన్‌కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్‌ కుమార్‌, దారపు అనూష, కలవకొల్లు సాంబ, అర్జి సత్యవతి, జనపరెడ్డి కనక శ్రీ రాజేశ్వరిలు టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే చంటి సాధరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాల్లో గౌరవం, విలువలు అనేవి ఎంతో కీలకమన్నారు. గౌరవంతో కూడిన రాజకీయం, అభివృద్ధితో కూడి ఆంధ్రప్రదేశ్‌ స్థాపనే ధ్యేయంగా కృషిచేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో మిళితమైన తాను ఏలూరులో ఆదర్శవంతమైన పాలనను అందించేందుకే ప్రాధాన్యతనిస్తున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలందరితో చర్చించే వైసిపిని వీడి టిడిపిలోకి వచ్చేవారిని స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ నేతలెవ్వరూ అధైర్యపడొద్దని, ఈ విషయంలో ఎక్కడా రాజీపడే పరిస్థితి లేదని, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి తగిన గుర్తింపు ఉంటుందని తేల్చిచెప్పిన ఆయన,, ఐకమత్యంతో కలిసి అడుగులేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడంలో అందరూ భాగస్వాములవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. చరిత్రను తిరగరాసి, తాను కలలుగన్న ఏలూరును సాకారం చేసే దిశగా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి,, ఒకరినొకరు గౌరవించుకుంటూ, అభివృద్ధి పాలనకు సహకరించాల్సిందేనని,, ఇందులో మరోమాటకు అవకాశం లేదని మరోసారి నొక్కి చెప్పారు. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో సాగుతోన్న కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన వారికి టిడిపిలో స్థానం ఉంటుందన్నారు. అదే ఆలోచనతో ఇప్పటివరకు 27 మంది కార్పొరేటర్లు టి.డి. పి లో చేరారని, త్వరలో ఇద్దరు డిప్యూటి మేయర్లు, ముగ్గురు కో – ఆప్షన్‌ మెంబర్లు, ఒక విప్‌ ని భర్తీ చేసుకుంటాం అని వెల్లడించారు. వీరందరినీ కలుపుకుని త్వరలో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటూ నూతన పదవుల్ని కేటాయిస్తామన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటి మేయర్ చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, టిడిపి నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, ఎమ్మార్డీ బలరాం, బొద్దాని శ్రీనివాస్‌, రెడ్డి నాగరాజు, మంచెం మైబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author