PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాహిత్యం అనేది మానవ వ్యక్తిత్వ వికాసానికి సోపానమం

1 min read

డాక్టర్ సుమిత్రా కొత్తపల్లి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక సెయింట్ థెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన హిందీ దినోత్సవ వేడుకలలో సర్ సి ఆర్ ఆర్ కళాశాలకు చెందిన హిందీ అధ్యాపకురాలు సుమిత్ర పాల్గొని ప్రసంగించారు. హిందీ సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె సాహిత్యంలో ప్రతి అంశం మానవ వికాసానికి ఉపయోగపడేది అన్నారు చేహితం సాహిత్యం అన్నారు పెద్దలు కథ కవిత నవల ఏదైనా కథా వస్తువులో మానవ వికాసం నిమిడి ఉంటుంది ఈ సందర్భంగా ఆమె ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్చంద్ రచించిన ముక్తి ధన్ కథాంశం లోని నిక్షిప్తమైన వ్యాపార ధోరణి, మానవత్వ విలువలు, మతసామరస్యం, వ్యక్తిత్వ వికాసం మొదలైన అంశాలను గురించి చర్చించారు. 13వ శతాబ్దంలో రచించిన కబీర్ దాసు లాంటి కవులు రచించిన పద్యాల సారాంశం ఈరోజుకి మనకు ఆచరణ యోగ్యమే నన్నారు. ప్రాచీనులైనా ఆధునికులైనా కవులు సమాజానికి అవసరమైన మానవత్వం విలువలు అందించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా సాహిత్యంలోని విలువలను అందిపుచ్చుకుంటూ, వాటిలో ఆచరణ యోగ్యమైన వాటిని అవలంబిస్తూ నవ సమాజ నిర్మాణానికి యువత భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా “రామాయణం. విభిన్న దృక్పదాలు ” అనే అంశంపై విభిన్న భాషల్లో హిందీ అధ్యాపకురాలు డాక్టర్ మహాలక్ష్మి సేకరించి రచించిన పరిశోధన వ్యాసాల గ్రంథాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామాయణంలోని ఒక్కో చరిత్ర ఒక్కో వ్యక్తిత్వానికి ప్రతీక అని రాముని వ్యక్తిత్వం ద్వారా ఒక ఆదర్శ పురుషుడైన పుత్రుడు భర్త తండ్రి ఎలా ఉండాలో నిరూపిస్తే రావణుడి చరిత్ర ద్వారా మానవుడు ఎలా ఉండకూడదు నిరూపించారన్నారు సుగ్రీవునిలో ఒక ఆత్మ మిత్రుడు హనుమంతునిలో భక్తుడు విభీషణుడిలో సలహాదారు ఇలా ఒకో చరిత్రకి ఒక విశిష్టత ఉందని తెలియజేశారు.

తెలుగు హిందీ విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో అధ్యాపకులు వై అరుణ ఝాన్సీ రాణి, డాక్టర్ కే అరుణ మరియు విద్యార్థినులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులను ప్రిన్సిపల్ డాక్టర్:సిస్టర్ మెర్సీ, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు.

About Author