పండ్ల తోటలతోనే జీవన అభివృద్ధి : ఏపీఓ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడతూరు (నందికొట్కూరు): రైతులు పండ్లతోటల పెంపకం తోనే అభివృద్ధి చెందుతారని ఏపీఓ బి జయంతి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని జలకనూరు, చెరుకుచెర్ల,బైరాపురం,49 బన్నూరు,కడుమూరు, చౌటుకూరు గ్రామాల్లో ఉన్న రైతులకు పండ్ల తోటల పెంపకం పై ఉపాధి హామీ పథకం సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏపీఓ జయంతి మాట్లాడుతూ 5 ఎకరాల లోపు ఉన్న రైతులు పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి ఉన్నట్లయితే ప్రభుత్వం తరఫున వచ్చే వాటిని మీకు వచ్చే విధంగా చేస్తామని అదేవిధంగా దానిమ్మ,ఛీనీ, డ్రాగన్,మామిడి,ఉసిరి, సీతాఫలం,నేరేడు,కొబ్బరి, నిమ్మ,మునగ పండ్ల మొక్కలను ఇస్తామని అన్నారు.అంతేకాకుండా ఇప్పుడు వర్షా కాలం సీజన్ కాబట్టి మొక్కల్లో ఎదుగుదల బాగుంటుందని ఈ పండ్ల చెట్లను మీరు ఇప్పుడు కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని అవే మీ జీవిత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని మీరు మొక్కలను సంరక్షించుకొని పోషిస్తే వాటికి గాను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మీ అకౌంట్లో నగదు వస్తుందని ఏపీవో రైతులకు వివరించారు. పండ్ల తోటల పెంపకంలో రైతులు ముందుకు రావాలని ఆమె రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు నాగయ్య,అలీ ఖాన్,రాములమ్మ, సాంబశివుడు మరియు ఎఫ్ఏ లు పాల్గొన్నారు.