PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రం అభివృద్ధి.. మంత్రి

1 min read

వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 5వ వార్డు కార్పొరేట‌ర్, కీల‌క నేత‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని 5వ వార్డు కార్పొరేట‌ర్, మాజీ స్టాండింగ్ క‌మిటీ స‌భ్యురాలు జి.ఎల్.వి సుజాత‌, మాజీ కార్పొరేట‌ర్ శేషు యాదవ్, త‌దిత‌రులు హైద‌రాబాద్‌లో మంత్రి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ త‌మ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమ‌ని నాయ‌కులు గ్రహిస్తున్నార‌న్నారు. క‌ర్నూలు న‌గ‌రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను ఒక్కొక్కటిగా ప‌రిష్కరిస్తున్నామ‌న్నారు.అనంత‌రం పార్టీలో చేరిన నేత‌లు మాట్లాడుతూ మంత్రి టి.జి భ‌ర‌త్ నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. క‌ర్నూలు న‌గ‌ర అభివృద్ధికి మంత్రి టి.జి భ‌ర‌త్ కృషి చేస్తార‌న్నారు. ప‌రిశ్రమ‌లు తీసుకొచ్చి యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించాల‌ని మంత్రిని కోరిన‌ట్లు నేత‌లు తెలిపారు.

About Author