PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టండి

1 min read

ముఖ్యమంత్రి తోనే అభివృద్ధి సాధ్యం..  పోచం రెడ్డి నవ్య తేజ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరడం, అలాగే ప్రభుత్వం కులాలు ,మతాలు, పార్టీలుకతీతంగా సంక్షేమ పథకాలు అందించడం తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కోడలు పోచం రెడ్డి నవ్యతేజ రెడ్డి అన్నారు, సోమవారం ఆమె చెన్నూరులోని పోలయ్య గారి వీధి, రెడ్డి వీధి, నాగల కట్ట వీధి లలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి తన మామ పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలలో ఏ పనులు అవసరమో ఆ పనులన్నిటి గుర్తించి ఆ పనులకు నిధులు కేటాయించి పనులన్నిటిని పూర్తి చేయడం జరిగిందన్నారు, అంతేకాకుండా ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయలతో అత్యవసరమైన పనులన్నిటిని కూడా చేపట్టడం జరిగిందన్నారు, కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆప్యాయతగా పిలిచే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పోచం రెడ్డి రవీంద్ర నాథరెడ్డి( తన మామ) మాత్రమేనని ఆమె అన్నారు, ఆయన తన భర్త పోచం రెడ్డి నరేన్ రాంజనేయుల రెడ్డి ఇంటిలో కుటుంబ సభ్యుల కన్న నియోజకవర్గ ప్రజలతోనే నిత్యం ఎక్కువ గడిపారని, ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎవరికి ఏమి కావాలో తెలుసుకొని ఆ పనులను నెరవేర్చ నాయకులని ఆమె అన్నారు, రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో నడవాలంటే కచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఎంతైనా ఉందని, నియోజక వర్గం అభివృద్ధి పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తోనే సాధ్యమని ఆమె తెలిపారు, అలాగే ఒక్కో ఇంటికి ఈ ప్రభుత్వంలో ఎంత మేలు జరిగిందో ఆమె ఓటర్లకు తెలియజేశారు, అభివృద్ధి సంక్షేమం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని, ఎంపీ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా ఓటర్లను కోరారు, ఈ కార్యక్రమంలో , వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, జడ్పిటిసి దిలీప్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఆర్ వి ఎస్ ఆర్, రామ సుబ్బారెడ్డి, ఆర్ ఎస్ ఆర్, ముదిరెడ్డి సుబ్బా రెడ్డి, శ్రీలక్ష్మి, మోహన్ రెడ్డి, గొర్ల పుల్లయ్య గారి శివారెడ్డి, అంకాల సుబ్బయ్య , అంకాల కార్తీక్, సిద్ధవటం హరి, జేఏసీ కన్వీనర్లు నిరంజన్ రెడ్డి, ఆరవేటి శ్రీనివాసులు, పి. రమేష్ రెడ్డి, టి ఎన్ చంద్ర రెడ్డి, ఎస్టీ సెల్ శ్రీనివాసులు, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, మైనార్టీ నాయకులు అన్వర్ భాష, మునీర్ అహ్మద్, జుమన్, అబ్దుల్ రబ్, వారిష్, హస్రత్, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author