వేకువ జాము నుండే శ్రీ మద్ది ఆంజనేయస్వామికి పోటెత్తిన భక్తులు
1 min readస్వామివారికి విశేష పూజలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధం కార్తీకమాసం సోమవారం కావడంతో వేకువఝాము నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి, దీపారాదనలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు ఆలయం వద్ద కార్తీకమాసోత్సవములలో భాగంగా ఉదయం గం. 5.00 లకు ప్రాతః కాలార్చన, తోమాలసేవ, గోపూజ, నిత్యహోమ బలిహరణలు అనంతరం ఏక త్రింశత్ (31) వ వార్షిక సప్తాహ మహోత్సవముల మహా పూర్ణాహుతి, దీక్షావిరమణ, సప్తాహ మహోత్సవ పరిసమాప్తి అనంతరం భజనపాలీలకు కార్యనిర్వహణాధికారిణి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించగా, వేద పండితులు ఆశీర్వదించారని ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన తెలిపారు.