గణనాధునికి ప్రత్యేక పూజల్లో భక్తాదులు..
1 min readవినాయకుని లడ్డు వేలం.. అన్నదాన కార్యక్రమాల్లో భక్తాదులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గత ఐదు రోజులుగా వినాయక సందడి నెలకొంది.బుధవారం చివరి రోజున సందర్భంగా ఉదయం నుండి వినాయక మండపాల దగ్గర పిల్లలు మహిళలు కమిటీ సభ్యులు అందరూ కూడా రంగులు చల్లుకుంటూ సంతోషంగా ఉన్నారు.మధ్యాహ్నం ఆయా మండపాల దగ్గర వినాయకుని లడ్డు వేలం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మల్లికార్జున రెడ్డి,రవి,అంబిరెడ్డి, మదన్మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో వినాయకుని ఏర్పాటు చేశారు.స్థానిక విద్యానగర్ కాలనీలో కృష్ణా రెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకుని ఏర్పాటు చేశారు.సాయిబాబా దేవాలయంలో లడ్డు వేలం పాటలో సద్గురు టెక్స్ టైల్స్ సాయి 60 వేలకు దక్కించుకున్నారు. ఓంకారయ్య,చిన్న వెంకట శేషయ్య,సుధాకర్ రెడ్డి,రాజు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం తర్వాత ట్రాక్టర్లలో గణనాధున్ని నిమజ్జనానికి జూపాడుబంగ్లాలో తీసుకువెళ్లారు.