PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు

1 min read

దాహర్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు

ఆకుల కొండలలో కార్య నిర్వహణ అధికారి

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :       జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద  ప్రతి  శనివారం నిర్వహించు అభిషేక ప్రక్రియలో భాగముగా  అర్చక స్వాములు శ్రీ స్వామివారి దృవమూర్తికి పంచామృత అభిషేక క్రతువు నిర్వహించారు. తదుపరి ఈరోజు  శ్రీస్వామివారి జన్మనక్షత్రమైన  పూర్వభాద్రా నక్షత్రం సందర్భముగా  ఆలయ మండపముపై  ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామివారిని, అమ్మవార్లను ఆసీనులను చేసి, అర్చక స్వాములు శ్రీస్వామివారి శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించినారు.   సదరు కళ్యాణములో  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు  ప్రసాదములు అందజేసినారు.   భక్తుల సౌకర్యార్ధం  ఆలయమువద్ద ప్రారంభించిన  మజ్జిగ చలివేంద్రంవద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారు. ఈరోజు అధిక సంఖ్యలో    భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినారు. శ్రీస్వామివారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ  పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ,  కురగంటి రంగారావు   పర్యవేక్షణలో  తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెల్పిరు.

About Author