PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాసం స్నానం ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలి …

1 min read

జిల్లా ఎస్పీ   జి. బిందు మాధవ్

భక్తులు ఒంటరిగా వెళ్ళకూడదు..దొంగల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి.

రేపటి (నంబర్ 2 నుంచి డిసెంబర్ 01 , 2024 వరకు) నుండి కార్తీక మాసోత్సవాలు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కార్తీక మాసం పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే పొగమంచు లో శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, అతి వేగంగా ప్రవహించే కాలువలు, వంకలు లోతుగా ఉన్న చెరువులలో కార్తీక పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్ళే భక్తులు తమ వెంట చిన్న పిల్లలు, వృద్దులు, మహిళలను తీసుకొని వెళ్లినట్లయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్  ఐపియస్ శుక్రవారం ఒక ప్రకటనలో పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు.  పెద్ద సంఖ్యలో భక్తులు నదీ స్నానాలు ఆచరించడానికి కర్నూలులో కార్తీక దీపాలు వదిలే  కర్నూలు   వినాయక్ ఘాట్,  ఓర్వకల్ –  శ్రీ కాల్వబుగ్గ రామేశ్వరం శివాలయం ,  శ్రీ బ్రహ్మగుండేశ్వరం శివాలయం  వెల్దుర్తి  పి.ఎస్,   నందవరం పియస్ పరిధిలోని గురజాల గ్రామం శివాలయం, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల దగ్గర  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కర్నూలు పట్టణంలోని వినాయక ఘాట్‌లో కార్తీక దీపోత్సవ వేడుకల సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము.  ముఖ్యంగా మహిళలు కె.సి. కెనాల్ లో నీటిలో దీపాలు వదిలివేస్తారు.  కెసి కెనాల్‌కు ఇరువైపులా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.  నదీ తీర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. స్నానాలు ఆచరించడానికి వచ్చే ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ నదీ స్నానాలు ఆచరించి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ  ప్రజలకు సూచించారు.పోలీసు వారు సూచించే నిబంధనలు భక్తుల రక్షణ, భద్రత కొరకేనని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. పుణ్య స్థానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు వారి కుటుంబ సభ్యులతో నది తీర ప్రాంతాలలో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ  ఆకాంక్షించారు.

About Author