జాతీయ జెండాను ఎగరవేసిన డి ఎఫ్ ఓ యం.హిమశైలజ
1 min readక్రమశిక్షణతో, అంకితభావంతో ప్రజలకు చేరువుగా ఉద్యోగులు విధులు నిర్వహించాలి
డివిజనల్ అటవీ శాఖ అధికారి
అటవీ పరిరక్షణ, జంతువుల సంరక్షణ మనందరి బాధ్యత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డివిజనల్ వన్యప్రాణి యాజమాన్య విభాగం అటవి శాఖ అధికారి కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ హిమ శైలజ మాట్లాడుతూ అటవీ పరిరక్షణ జంతువుల సంరక్షణ మరియు ప్రజల రక్షణ, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు క్రమశిక్షణతో అంకితభావంతో ప్రతి ఒక్క అటవీ శాఖ అధికారులు విధులు నిర్వహించాలన్నారు. ఎంతోమంది అమరవీరులు,త్యాగమూర్తుల త్యాగాలతో సంపాదించుకున్న స్వాతంత్రం నేడు మనం జరుపుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్నారు. భారత ప్రజలు స్వేచ్ఛ వాయువులు తో సమాజంలో ఆనందంగా జీవిస్తున్నామంటే వారి త్యాగ ఫలాలే అన్నారు. స్వాతంత్రం రాకముందు ఇతర దేశస్తులు మనల్ని చిత్ర హింసలకు గురి చేసి ఇబ్బందులు చేశారని, కానీ నేటి సమాజంలో మనకు మనమే శాంతి భద్రతలను భంగం కలిగిస్తున్నామని వాటిని విడనాడాలి అన్నారు. రాజ్యాంగ బద్దంగా స్వాతంత్రం అనేది మన హక్కు , మనం సంతోషంగా ఉంటూ ఎదుటివారి సంతోషాన్ని హరించకూడదన్నారు. దేశభక్తి అంటే మన చేస్తున్న ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తే అదే దేశభక్తి , దైవభక్తి అన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఏడాదిలో ఈ ఒక్క రోజే కాకుండా అనునిత్యం గుర్తు ఎరగాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ అశోక్ కుమార్, గంగా భవాని, మరియు సెక్షన్ ఆఫీసర్ లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.