జీవన శైలి మార్పులతో …అదుపులో డయాబిటిస్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. గురువారం నవంబర్ 14 ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా మెడికల్ కాలేజీలోని ఎండోక్రోనాలజీ విభాగము ఆధ్వర్యంలో హెచ్.ఓ.డి & ప్రొఫెసర్ డా. శ్రీనివాసులు అధ్యక్షతన నర్సులకు డయాబెటిస్ అవగాహనపై నిరంతర వైద్య విద్య (సిఎంఇ) ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి పెరిగిపోయిందని శారీరక శ్రమ తగ్గిందని ఆహార అలవాట్లు మారిపోయాయని అందువల్ల ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పదని తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డయాబెటిక్ రోగుల సంరక్షణలో నర్సింగ్ సేవలు కూడా ముఖ్యమని రోగులకు డయాబెటిక్ కేర్ గురించి వివరించాలని వారి సేవల విషయం లో వ్యాధి పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.ఎండోక్రోనాలజీ ప్రొఫెసర్ & హెచ్. ఓ.డి డాక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ డయాబిటీస్ కు ప్రతి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని అయితే రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలని ప్రతి నెల క్రమం తప్పకుండా షుగర్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని తదనుగుణంగా వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు.ఈ కార్యక్రమం లోఅసోసియేట్ ప్రొఫెసర్డాక్టర్ రాధా రాణి మరియు డిపార్ట్మెంట్ సిబ్బంది , నర్సింగ్ సూపరిండెంట్ గ్రేడ్ 1 సావిత్రీ బాయి, బీఎస్సీ, జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు, అధ్యాపకులు మొత్తం 350 పాల్గొన్నారు.