దివ్యాంగులు.. వ్యాపారంలో రాణించాలి
1 min readజిల్లా దివ్యంగుల సంక్షేమం -సహాయక సంచాలకులు Smt Rais ఫాతిమా
- నిరుద్యోగ దివ్యాంగుల కోసం గార్వ్స్ సి సెంటరు ప్రారంభం
కర్నూలు, పల్లెవెలుగు : పీస్ రురల్ డెవలప్మెంట్ సొసైటీ కర్నూల్ వారి ఆధ్వర్యములో ఎనబ్లె ఇండియా మరియు ఆక్సిస్ బ్యాంకు ఫౌండేషన్ సహకారంతో కర్నూల్ జిల్లా లోని నిరుద్యోగ దివ్యంగుల కోసం స్వశక్తి -గ్రామీణ ఉపాధి పథకం – లో భాగంగా గార్వ్స్ సి (Garvse ) సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా GarvSe సెంటర్ ప్రారంభించడానికి ముఖ్య అతిథులు గా జిల్లా దివ్యంగుల సంక్షేమం -సహాయక సంచాలకులు Smt Rais ఫాతిమా, రురల్ సెల్ఫ్ ఎంప్లొఎమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (రెస్టి) డైరెక్టర్ పూస్ఫకుమార్, ఎన్బల్ ఇండియా రీజినల్ డైరెక్టర్ షిజో జోసెఫ్, స్టేట్ మేనేజర్.సుమిత్ , సంస్థ ప్రెసిడెంట్ – ఎం.దరగయ్య, కొమ్ముపాలెం శ్రీనివాసులు, నజీర్ అహ్మద్ , దివ్యంగుల సంఘాల నాయకులు శ్రీ.కృష్ణుడు , ఆంజనేయులు , ఎల్లప్ప గారు,దేవేంద్ర,రామమూర్తి, పార్థసారథి తోపాటు 35 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా అధికారులు మాట్లాడుతూ దివ్యంగులు వ్యాపారం ఏర్పాటు చేసుకోవాల్సిన అంశాలు ఫై ట్రైనింగ్ పొందడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందని ,జీవనోపాధులను మెరుగు పరుచుకోవచ్చునని తెల్పినారు.10 రోజుల EDP-Entreprenurship Development Training -ట్రైనింగ్ అనంతరము వ్యాపార యూనిట్స్ ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుందని తెల్పినారు.RSETI డైరెక్టర్ వారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇస్తున్న EDP ట్రైనింగ్సి , స్కిల్ ట్రైనింగ్ గురించి తెలిపినారు.రీజినల్ డైరెక్టర్ -షిజో జోసెఫ్ గారు, ఎన్బల్ ఇండియా తరుపున ఇస్తున్నజీవనోపాధుల ట్రైనింగ్స్ గురించి వివరించారు.తద్వారా ఎంతో మంది దివ్యంగులు గర్వాంగా జీవిస్తున్నారు అని …అందుకే గార్వ్ సి సెంటర్ ద్వారా గ్రామీణ సామజిక అవగాహనా కార్యక్రమాలు చేపట్టి గ్రామాలలో ఉన్న దివ్యంగులకు వృత్తి నైపుణ్యంలు నేర్పించి మంచి ఉపాధి పొందేటట్లు చేస్తున్నమని తెల్పినారు.ఇలాంటి మంచి అవకాశం కల్పనచినందుకు పీస్ రురల్ డెవెలెప్మెంట్ సొసైటీ కి మరియు ఎన్బల్ ఇండియా వారికీ దివ్యంగుల సంగాల నాయకులు ధన్యవాదములు తెల్పినారు.ఇలాంటి కార్యక్రమాలు భవిషత్తులో ఎన్నో జరపాలి అని కోరినారు. కార్యక్రము విజవంతం కావడానికి సహాయ సహకారాలు అందిస్తామని తెల్పినారు.