PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యావత్ దళిత జాతికి కొంత నిరాశ కలిగించే తీర్పు…

1 min read

శిరోముండనం కేసులో నిoదుతుడు తోట త్రిమూర్తలు కి యావజ్జీవ శిక్ష పడేలాగా ప్రభుత్వo తీర్పును సవాల్ చేయాలి

దళిత సంక్షేమసంఘం ఊమ్మడి కృష్ణజిల్లా అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: కంకిపాడు – శిరో ముండనం కేసులో తోట త్రీమూర్తులకు కేవలం 18 నెలల శిక్ష విధించడం 28  సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బాధితులకు అలాగే యావత్ దళిత జాతికి కొంత నిరాశ కలిగించే అంశం అని దళిత సంక్షేమసంఘం జిల్లా  అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్ పేర్కొన్నారు.బుధవారం కంకిపాడులో సంఘ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఊమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో దళితజాతి ఆశించిన విధంగా నిందితులకు శిక్ష పడలేదు అని బాధిత కుటుంబాలు 28 ఏండ్ల గా నిరీక్షణ అసంపూర్ణం గానే ఉంది అని అభిప్రాయపడ్డారు  ప్రభుత్వం కూడా కేసు విషయంలో సాక్షాలు సేకరించే విషయంలో విఫలం అయింది అని, సాక్షులను నిందితులు బెదిరించి తప్పుడు కేసులు ఎదురుపెట్టి బెదిరించి కేసును నిరుకార్చే విధంగా చేసి దళిత బిడ్డలను హింసకు గురిచేసి దారుణంగా శిరో ముండనం  చేసిన నిందితులకు కేవలం 18 నెలలు జైలుశిక్ష పడేలాగా చేయటం ద్వారా యావత్ దళిత జాతి పట్ల వివక్ష  చూపారు అని వాపోయారు. ప్రభుత్వం వెంటనే ఈ కేసుపై  పై కోర్టు లో సవాల్ చేయాలి అని లేకుంటే ముందు ముందు మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అభిప్రాయపడ్డారు. ఒక పక్క ఎమ్మెల్సీ అనoతబాబు కూడా బహిరంగగా తిరుగుతు బాధితులను బెదిరిస్తున్నాఈ తరుణంలో శిరోముండనం కేసులో  ఇలాంటి తీర్పు  డైవర్స్ సుబ్రమణ్యం కేసుపై ప్రభావం చూపిస్తుంది అని  వాపోయారు ఈ కేసులో ప్రభుత్వం వెంటనే అపిల్ కి వెళ్లి తోట త్రీమూర్తులకు నేరానికి తగిన శీక్ష పడేలాగా చేసి  బాధితులకు అలాగే దళిత జాతికి న్యాయం చేయాలని కోరారు.సుదీర్ఘ కాలం న్యాయం కోసం పోరాడి నిలబడిన వెంకటాయపాలెం దళిత బిడ్డలు అందరికీ ఆదర్శం అన్నారు.

About Author