PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యుడు ఉదయించక ముందే పింఛన్లు పంపిణీ

1 min read

ఒకే నెలలో రెండుసార్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేసిన ఘనత బాబుదే

మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనతే అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని మంత్రాలయం రచ్చమర్రి గ్రామంలో జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న, బిజెపి ఇన్చార్జ్ మాధవరం విష్ణు వర్ధన్ రెడ్డి తో కలిసి   ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువు లకు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఒకే నెలలో రెండవసారి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.  లబ్ధిదారులకు ఎంతో సంతోషకరమైన విషయమని,గత వైసిపి పాలనలో ఒకటవ తేదీ ఆదివారం వస్తే మూడో తేదీ పెన్షన్ పంపిణీ చేసేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వం లో  ఆ సమస్య లేకుండా ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేసి లబ్ధిదారు కళ్ళలో కూటమి ప్రభుత్వం ఆనందం చూస్తుందని తెలిపారు. మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రచ్చమరి టిడిపి నాయకులు పోలి వీరేష్, పోలీ శివ,డీలర్ తిమ్మప్ప, హుశేని, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య , చావిడి వెంకటేష్, శ్రీనివాసులు, బండ్రాళ్ళ నరసింహులు, ఉసెని,హనుమంతు,ఈరన్న,బాలరాజు,జనసేన యేసేబు,చిదానంద,నాగన్న, చాకలి శివ, వెంకటరాముడు, వీరాంజనేయులు, నాగరాజు, రాముడు, బాబు, నాగేంద్ర, కూటమి నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *