ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం ఉదయం 11 గంటలకు NTR కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలోని 96 వ సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాo లో జరుగుచున్న నాలుగు రకాల వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమములో పాల్గొని మహిళలకు డెమో శ్రీనివాసులు అవగాహన కల్పించినారు,చిన్నారుల్లో శారీరక లోపాలు,అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారము చుట్టింది,అప్పుడే పుట్టిన శిశువు నుంచి 18 ఏళ్ళ పిల్లల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో ఆరోగ్య సమస్యలను గుర్తించి ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ చేపడుతుందని తెలిపారు.ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.గ్రహణమొర్రి,పెదవి చీలిక,వంకర పాదాలు,నడుము భాగము వృద్ధి లోపము,సంక్రమిక కంటి పొర,గుండె జబ్బులు,పుట్టుకతో వచ్చే చెవుడు,రేటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ ,రక్తహీనత,విటమిన్ల లోపము,మేధోపరమైన అసమానత,వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవడము,ఆటిజం,అభ్యసన సమస్యలు, తలసేమియా,డౌన్ సిండ్రోమ్,న్యూరల్ ట్యూబ్ లోపము సహ ఇతర 30 రకాల ఆరోగ్య సమస్యలు లోపాలు గుర్తించడానికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలలో గుర్తించిన వ్యాధులకు జిల్లా సత్వర చికిత్స కేంద్రము ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని 42 నంబర్ లో వారికి వైద్య నిపుణులచే చికిత్సలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ డెమో చంద్ర శేఖర రెడ్డి , ఆరోగ్య విద్యా బోధకురాలు పద్మావతి ,సచివాలయ ఆరోగ్య కార్యకర్త సుప్రియా ,అంగన్వాడీ టీచర్ అభిజమ్మ ,ఆశా కార్యకర్తల అనురాధా , మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.