భార్యాభర్తల గొడవలు , కుటుంబ కలహాల పరిష్కారానికి దిశ ఫ్యామిలీ కౌన్సిలింగ్
1 min readమహిళల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత … దిశా డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ రేంజ్ డీఐజీ శ్రీ సిహెచ్ .విజయ రావు ఐపీఎస్ , జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ల ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు దిశ పోలీసుస్టేషన్ లో కర్నూల్ దిశా డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన 6 కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించి డిస్పి మాట్లాడారు. ఇందులో 2 కుటుంబాలు రాజీ అయ్యాయి.వారికి కుటుంబ గొడవలు, భార్యాభర్తల సమస్యలు మరియు ఇతర మహిళా సంబంధిత పిర్యాదుల పరిష్కారంలో సమర్థవంతంగా కౌన్సిలింగ్ నిర్వహించుటకు పలు కీలక సూచనలు చేశారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చర్యలు తీసుకుంటున్నామని , కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా ముఖ్యమైనది.భార్యాభర్తలు చిన్న చిన్న కలహాలు, మనస్పర్థలతో, అనుమానాలు, అపార్థాలు, అసూయా ద్వేషాలతో వారి కుటుంబాలు కుప్పకూలకుండ నిలబెట్టడంలో ఈ దిశా కౌన్సెలింగ్ సెంటర్ ఎంతోగానూ దోహదపడుతుందని కర్నూలు దిశా డిఎస్పీ జె. బాబు ప్రసాద్పేర్కొన్నారు. కుటుంబ తగాదాలు, భార్య భర్తల గొడవలకు చక్కటి పరిష్కార మార్గం చూపుటకు కౌన్సిలింగ్ సమర్థవంతం నిర్వహించుటకు అనుభవజ్ఞులైన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, అంకితభావంతో, పనిచేయాలని, సమస్యలు త్వరితగతిన పరిష్కరించే విధంగా చూడాలని సిబ్బందికి కర్నూలు దిశా డిఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు దిశా సిఐ లు, ఎస్సై లు, కౌన్సిలింగ్ నిపుణుడు రిటైర్డ్ లెక్చరర్ సత్యనారాయణ, అడ్వకేట్స్ కావేరి, సైకాలజిస్ట్ పెరుమాళ్ళ లెనిన్ బాబు, ఒన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మేరీ , సునీత లు, NGOs, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.