PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

100 శాతం పెన్షన్ల పంపిణీకి చర్యలు

1 min read

మధ్యాహ్నం నాటికి 95 శాతం పూర్తి

లబ్ధిదారులకు పెన్షన్ల సొమ్మును పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక శాంతినగర్ సచివాలయం-2 పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్బంగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల సొమ్మును జిల్లా కలెక్టర్ స్థానిక టిడిపి డివిజన్ ఇంచార్జ్ అట్లూరి రామారావు సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను తొలి రోజే పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. పూర్తిగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయడం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ల  పంపిణీ సజావుగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పెన్షన్ల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకు ఎప్పటినుంచి పెన్షన్లు వస్తున్నాయి, ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను అందిస్తున్నారా అంటూ పలు వివరాలను ఆరా తీశారు. జిల్లాలో మధ్యాహ్నం 4 గంటలకే 95 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందన్నారు.  జిల్లాలో 2,64,966 మంది పెన్షన్లు పొందుతుండగా వారిలో మధ్యాహ్నం నాటికి 2,52,089 మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయిందన్నారు.  అక్టోబరు మాసపు పెన్షన్ల కింద రూ. 113.24 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా ఇంతవరకు రూ. 107.69 కోట్లు(95 శాతం) పంపిణీ పూర్తిచేశారన్నారు.  ఇందుకోసం 5174 మంది సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అనివార్య కారణాలతో ఆగష్టు, 1వ తేదీన పెన్షన్ తీసుకోనివారికి  అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్బంగా సెలవు కావున తిరిగి అక్టోబర్ 3వ తేదీ గురువారం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, శ్రీ భారతి విద్యాసంస్థల అధినేత రవి,కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి డాక్టర్:ఆర్. విజయరాజు, నగరపాలక కమీషనరు ఎన్. భానూప్రతాప్, స్ధానిక ప్రజా ప్రతినిధులు, ఆర్ ఎన్.అర్.నాగేశ్వరరావు,తదితరులు ఉన్నారు.

About Author