గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, భోజనం పంపిణీ
1 min readనాటినుండి నేటి వరకు నిర్విరామంగా కొనసాగుతున్న సొసైటీ సేవా కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు, పురవీధుల్లో బిక్షటన చేస్తున్న వృద్ధులకు శనివారం అధ్యక్ష, కార్యదర్శి దుప్పట్లు, భోజనం అందజేశారు. ఈ శీతాకాల సమయంలో కుటుంబ సభ్యులు లేని కొంతమంది రోడ్లపై చలిలో సంచరిస్తున్న వృద్ధులకు సొసైటీ అధ్యక్షుడు సొంగ మధు, కార్యదర్శి యర్రా జయదాస్, సభ్యులు బాలరాజు శుక్రవారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. సొసైటీ స్థాపించిన నాటినుండి నేటి వరకు దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. తమకున్న దానిలో కొంతైనా సేవ చేసేవారికి దాతలు అందించటం అభినందనీయమన్నారు. తమ పనులను ముగించుకొని కొంత సమయాన్ని వెచ్చించి సేవా కార్యక్రమాలకు వినియోగించటం చెప్పుకోదగ్గ విషయంగా పలువురు ప్రశంసిస్తున్నారు.